పుట్ట మధుని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం

మంథని అభివృద్ధికి పట్టం కడదాం..!
మంథని, (జనంసాక్షి) : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు సుంకరి పోతరాజు ఆధ్వర్యంలో మంథని ప్రెస్ క్లబ్ లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ పెంట అజయ్ పటేల్ మాట్లాడుతూ..మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధు ని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. గత 40 సంవత్సరాల నుంచి మంథని నియోజకవర్గాన్ని ఒకే వర్గం పాలిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని గుర్తు చేశారు. బీసీ బిడ్డ అయినా పుట్ట మధు ని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. మంథని నియోజక వర్గ వ్యాప్తంగా మహనీయుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారని ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఇక్కడ లేని విధంగా అభివృద్ధి మన తెలంగాణలో ఉందని, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం, విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయలు పేద విద్యార్థులకు ఇచ్చి విదేశాలకు పంపడం జరుగుతుంది.. లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ పార్టీ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆ అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు సుంకరి పోతరాజు, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మంథని నియోజకవర్గం ఇంచార్జ్ పెద్దపెల్లి మధుకర్, ఆకుల శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.