పుజారా (159) ఔట్‌

హైదరాబాద్‌: న్యూజిలాండ్‌తో ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ తొలిరోజు అజేయ సెంచరీ చేసిన చటేశ్వర్‌ పుజారా ఔటయ్యాడు. రెండో రోజు 159 వ్యక్తిగత పరుగుల వద్ద జీటన్‌పటేల్‌ బౌలింగ్‌లో ఫ్రాంక్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పుజారా వెనుదిరిగాడు. ప్రస్తుతం అశ్విన్‌ 10, ధోని 71 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.