పురుగుల మందు తాగి మహిళ మృతి

పెద్దపల్లి,మే26(జనంసాక్షి): మండలంలోని బోజన్నపేట గ్రామానికి చెందిన బాలసాని ఎల్లమ్మ(55)సం,,శుక్రవారం సాయంత్రం పురుగుల మంద తాగి ఆత్మహత్య చేసుకుంది.ఈమేకు గతసంవత్సరం నుంచి కడుపునొప్పి బాధతో మందులు వాడుతున్నది.గత పది రోజుల నుంచి నొప్పి విపరీతమవడంతో పురుగుల మందు సేవించిం ది.చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కరీంనగర్‌ తరలిస్తుండా మార్గమద్యంలో చనిపోయింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.