పులిహోర వికటించి 40 మంది అస్వస్థత

కరీంనగర్‌: కరీంనగర్‌ మండలం చెర్లబూత్కూరు గ్రామంలోని ప్రశాంతనగర్‌ కాలనీలో వినాయకుని ప్రసాదం కోసం తయారుచేసిన పులిహోర వికటించి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం కాలనీలో ప్రతిష్ఠించిన గణేశుడి నిమజ్జనం ఘనంగా జరిగింది. ప్రసాదంగా తయారుచేసిన పులిహోర మిగలడంతో ఈరోజు ఉదయం కొందరు దాన్ని తిన్నారు. వారంతా వాంతులు, విదేచనాలతో అస్వస్థతకు గురికాగా చికిత్సకు కరీంగన్‌ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు.