పూరీ-చెన్నైల మధ్య సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

భువనేశ్వర్‌: ఈ నెల 22న పూరీ-చెన్నైల మధ్య సూపర్‌ ఫాస్ట్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనుంది. ప్రతి సోమవారం సాయంత్రం 4.15 గంటలకు చెన్నై నుంచి తిరిగి పూరీకీ ఈ సూపర్‌ ఫాస్ట్‌ రైలు బయల్దేరుతుంది. విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, సూళ్లూరుపేటల మీదుగా ఇది ప్రయాణిస్తుంది. ప్రతి ఆదివారం సాయంత్రం ఐదున్నరు గంటలకు ఈ రైలు పూరి నుంచి చెన్నై బయల్దేరుతుంది.