పూర్తియిన ఎర్రన్నాయుడు అంత్యక్రియలు

శ్రీకాకుళం: టీడీపీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో అధికార లాంచనాలతో నిర్వహించారు. భౌతికకాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. అభిమానులు, కార్యకర్తల రోదనలతో నిమ్మాడ శోకసంద్రంలో మునిగిపోయింది.