పూలమార్కెట్లకు శ్రావణ శోభ

విశాఖపట్టణం,ఆగస్ట్‌4(జనం సాక్షి ): పూలమార్కెట్లకు శ్రావణ శోభ వచ్చింది. ఆనందపురం మండలంలోని వేములవలస రోజువారీ పూలమార్కెట్‌కు శ్రావణ శోభ సంతరించుకుంది. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో పాటు నేడు వరలక్ష్మీ వ్రతం కావడంతో ర్కెట్‌కు కొనుగోలుదారుల తాకిడి అధికమైంది. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రిని కొనుగోలు చేయడానికి నగరం నుంచి మహిళలు అధికసంఖ్యలో వస్తున్నారు. దీంతో మార్కెట్‌లో అమ్మకాలు జోరుగా ఊపందుకున్నాయి. ఆషాఢమాస ప్రభావంతో ఇప్పటివరకు బోసి పోయిన మార్కెట్‌ శ్రావణమాస రాకతో వ్యాపారస్తుల్లో నూతనోత్సాహం సంతరించుకుంది. ఇక్కడి ఆలయాల్లో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు.