పెరిగిన రైలుఛార్జీలు అమల్లోకి

సికింద్రాబాద్‌ : పెరిగిన రైలు ఛార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో టికెట్లు కొని ఈ నెల 22వ తేదీ (మంగళవారం) నుంచి ప్రయాణాలు చేసేవారు రైల్వే స్టేషన్లలోని బుకింగ్‌ కార్యాలయాల్లో తమ ఛార్జీ వ్యత్యాసాలను చెల్లించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ప్రజాసంబంధాల అధికారి కె. సాంబశివరావు ఒక ప్రకటనలో సూచించారు. పలు స్టేషన్లలో అదనంగా కూగా కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైళ్లలోనూ ఛార్జీ వ్యత్యాసాన్ని వసూలుఉ చేసి రసీదును జారీ చేసే అధికారం టీటీఈలకు ఇచ్చామని ఆయన చెప్పారు. ఆయా ప్రయాణికులు ఎంత మేరకు వ్యత్యాసాన్ని చెల్లించాలనే అంశం రిజర్వేషన్‌ ఛార్ట్‌లో నమోదు చేస్తున్నామని వివరించారు.