పెషావర్‌లో బాంబు దాడి-19 మంది మృతి

పెషావర్‌లో బాంబు దాడి-19 మంది మృతి

ఇస్లామాబాద్‌ : పెషావర్‌లో తీవ్రవాదులు ఓ బస్సుపై జరిపి బాంబు దాడిలో 19 మంది మరణించారు. సివిల్‌ సెక్రటేరియట్‌ సిబ్బందితో ఉన్న బస్సుపై పెషావర్‌లోని చర్సద్ద రోడ్డులో వెళుతుండగా తీవ్రవాదుస్త్ర రిమోట్‌ కంట్రోల్‌తో బాంబు పేల్చడంతో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఓ బాలిక ఉన్నట్టు పాక్‌ మంత్రి ఇఫ్తికార్‌ హుస్సేన్‌ తెలిపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఏ సంస్థ ఇంత వరకు ప్రకటించుకోలేదు.