పేదలకు సాయం కోసం ముందుకు వచ్చిన శివరాజ్‌ సింగ్‌

భోపాల్‌,మార్చి5(జ‌నంసాక్షి):  మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీఠం కోల్పోయిన తరువాత తొలిసారిగా మార్చి 5న మంగళవారం  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన 60వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం… తాను పదవీకాలంలో ఉండగా అందుకున్న కానుకలను, మెమెంటోలను వేలం వేయనున్నట్లు ప్రకటించారు. ఈ వేలంలో వచ్చిన మొత్తాన్ని పేదలకు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికితోడు ఆయన ఒక ప్రత్యేక ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులను పేదల సంక్షేమానికి వినియోగించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తాను పదవిలో ఉన్న కాలంలో పేదల సంక్షేమానికి దోహదపడేలా అనేక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. పస్తుతం తాను పదవిలో లేకపోయినప్పటికీ పేదల కోసం ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుదే వారి కోసం కార్యచరణ చేయనున్నానని ప్రకటించారు.