పేద ప్రజల అభివృద్ధి,సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ద్యేయం
వలిగొండ జనం సాక్షి న్యూస్ ఆగస్టు 27: పేద ప్రజల అభివృద్ధి,సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి,స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి లు అన్నారు.శనివారం మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో ఇటీవల నూతనంగా మంజూరైన ఆసరా ఫెన్షన్ గుర్తింపు కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేసి వారు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల వారి అభ్యున్నతితోపాటు ఆసరా ఫెన్షన్లు,రైతు బంధు,రైతు భీమా,కళ్యాణలక్ష్మి,షాది ముబారక్,ఉచిత విద్యుత్,సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని,దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి గొప్పగా అమలు చేస్తున్నారని వారు అన్నారు.అనంతరం విఆర్ఏ లు 35 రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదని స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి మందడి ఉపేందర్ రెడ్డి,ఎంపిపి నూతి రమేష్ రాజ్,వైస్ ఎంపిపి బాతరాజు ఉమా బాల్ నర్సింహ మార్కెట్ చైర్మన్ కొనపురి కవిత,స్థానిక సర్పంచ్ బొల్ల లలితా శ్రీనివాస్,ఎంపిటిసిలు పలుసం రమేష్,కుందారపు యశోద కొమురయ్య,పల్లెర్ల భాగ్యమ్మ రాజు,అరూర్ పిఏసీఎస్ చైర్మన్ చిట్టెడి వెంకట్రాంరెడ్డి,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి,మదర్ డెయిరీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్ రెడ్డి,ముద్దసాని కిరణ్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ ఎలిమినేటి సత్యనారాయణ,ఎంపిడిఓ గీతారెడ్డి.ఎస్ఐ ప్రభాకర్,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,లబ్ధిదారు