పైకప్పు పెచ్చులు పడి ఉపాధ్యాయురాలికి గాయాలు

కర్నూలు: జిల్లాలోని డోన్‌ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించకున్నారు. తరగతిగదిలో పద్మజ అనే ఉపాధ్యాయురాలు బోధిస్తున్న సమయంలో తరగతి గది పైకప్పు పెచ్చులు వూడి ఆమెపై పడటంతో తలకు గాయమైంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి  తరలించారు.