పైరవీలతో తెలంగాణా రాదు ఉద్యమాల ద్వారానే సాధ్యం: సురవరం

హైదరాబాద్‌: పైరవీలతో తెలంగాణా రాదని ఉద్యమాల ద్వారానే సాధ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యధర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు శుక్రవాం రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో హైదరాబాన కేంద్రీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత హనుమంతరావు ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ ఈ అవార్డు తనను వరించటం గర్వకారణమాన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడమేనన్నారు. చిన్న రాష్ట్రాలతో నక్సలిజం వస్తుందంటే కేరళ, గోవా, పంజాబ్‌, హర్యానాల్లో ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. నక్సలిజం సమస్యను సామాజిక, ఆర్థిక, సాంఘిక కోణంలో చూడాలన్నారు. 60 ఏళ్లైనా స్వాతంత్రయ సమర యోధులకు ఫించన్ల మంజూరులో కేంద్రం న్యాయం చేయటం లేదన్నారు. సెప్టెంబరు 17ను స్వాతంత్య్ర దినోత్సవంగా ఎందుకు గుర్తించటం లేదని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడిన తరువాత తెలంగాణకు అన్ని విధాల అన్యాయం జరిగిందన్నారు.