‘పైసా బోల్తా హై’ పేరుతోఆర్‌బీఐ వెబ్‌సైటు
హైదరాబాద్: దేశంలో ఉత్తర, ఈశాన్య భారత సరిహద్దులనుంచి దేశంలోకి వస్తున్న వేలకోట్ల రూపాయల నకిలీ కరెన్సీనోట్లు ఆర్‌బీఐకి తలనొప్పిగా పరిణమించాయి. ప్రస్తుతం దేశంలో 16 వేల కోట్ల నకిలీనోట్లు చలామణిలో ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్తలు అంచనా వేశాయి. దీంతో నకిలీ కరెన్సీ నోట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకుగాను ఆర్‌బీఐ ‘ పైసాబోల్తా హై’ పేరుతో ఇటీవల ఓ వెబ్‌సైటు ప్రారంభించింది. ఇందులో పదిరూపాయల కరెన్సీ నోటునుంచి వేయి రూపాయల నోటువరకు ఆరు కరెన్సీ నోట్లను పొందుపరిచారు. నిజమైన కరెన్సీనోటు ఎలా ఎంటుంది? నకిలీనోటును ఎలా పసిగట్టాలి… తదితర విషయాలను వివరించారు.