పోచారం ప్రాజెక్టుకు జలకళ

నాగిరెడ్డిపేట: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజమాబాద్‌ జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిటీమట్టంతో జలకళను సంతరించుకుంది.20.6 అడుగులతో 1.82 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. అదనపు నీరు దిగువకు  పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 300 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.