పోతంగల్లో తైబజార్ వేలం పాట.

అధిక ధర పలికిన డైలీ మార్కెట్ వేలంపాట.
మేకల సంత,వీక్లీ మార్కెట్ వేలం పాటలు మంగళ వారానికి వాయిదా.

 

కోటగిరి మార్చి 18 జనం సాక్షి:-పోతంగల్ మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ వర్ని శంకర్ అధ్యక్షతన గ్రామ కార్యదర్శి డబ్ల్యూ యాదవ్ నేతృత్వంలో మేకల సంత,డైలీ మార్కెట్,వీక్లీ మార్కెట్ వేలం పాటలు నిర్వహించారు.మొదటగా మేకల సంత,వీక్లీ మార్కెట్ లకు వేలం పాట నిర్వహించారు.ఈ వేలం పాటల్లో గ్రామ పంచాయితీ ఆశించినంత ఆదాయం రాక పోవడంతో ఈ నెల 21 న మంగళవారానికి మేకల సంత,వీక్లీ మార్కెట్ వేలం పాటలు పోస్ట్ పోన్ చేసినట్లు పంచాయతీ కార్యదర్శి డబ్ల్యూ యాదవ్ పేర్కొన్నారు.అనంతరం డైలీ మార్కెట్ కు జరిగిన వేలంపాటలో మహాజన్ సందీప్ రూ.1లక్ష 46వేలకు దక్కించుకున్నారు.ఈ వేలం పాట కేవలం12 నెలల కాల వ్యవధికి మాత్రమేనని గ్రామ కార్యదర్శి డబ్ల్యూ యాదవ్ తెలిపారు.ఏది ఏమైనప్పటికీ గ్రామ పంచా యతీకి మాత్రం గతంలో కన్న ఈ సారి జరిగిన డైలీ మార్కెట్ వేలం పాట ఆదాయాన్ని పెంచిందని స్థానికులు అభిప్రాయ పడ్డారు.ఈ వేలం పాటలో ఎంపిటిసి కేశ వీరేశం,ఉప సర్పంచ్ వినోద్,జూనియ ర్ అసిస్టెంట్ సందీప్,కారోబార్ నాగేష్,గ్రామ పెద్దలు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.