పోతంగల్లో భారీ మొత్తంలో పీడిఎస్ బియ్యం పట్టివేత.

పోతంగల్లో భారీ మొత్తంలో పీడిఎస్ బియ్యం పట్టివేత.ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు.కోటగిరి మార్చి 21 జనం సాక్షి:-కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పోతంగల్ సేకండ్ బిడ్జి వద్ద స్థానిక పోలీసులు నిర్వహిస్తున్న రోజువారీ తనిఖీలలో భాగంగా మంగళవారం ఉదయం మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బియ్యం లారీని పట్టుకున్నారు.ఈ తనిఖీలో MH 16 CC 9512 నంబర్ గల బియ్యం లారీని కోటగిరి పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.సుమారు 30 టన్నుల రేషన్ బియ్యం పోతంగల్ మండలం మీదుగా వెళ్తుండగా పట్టుకున్నామని వారు పేర్కొన్నారు.