పోలవరం టెండర్లపై సీఎస్‌ సమీక్ష

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో హైపవర్‌ కమిటీతో సమావేశమైన సీఎస్‌ పోలవరం టెండర్లపై చర్చిస్తున్నారు. ఇటీవలే ఈటెండర్ల విషయంపై హైకోర్టును ఆశ్రయించిన మూడు కంపెనీలకు చెందిన బిడ్లను వారు పరిశీలిస్తున్నారు.