పోలీసుస్టేషన్‌లో దొంగ అనుమానాస్పద మృతి

నందివాడ: కృష్ణా జిల్లా నందివాడ పోలీసు స్టేషన్‌లో ఓ దొంగ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లక్ష్మీనరసింహపురంలో నిన్న దొంగతనానికి వచ్చిన దొంగను పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. అయితే గురువారం రాత్రి అతను అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. తెల్లవారుజామున మృతదేహాన్ని గుడివాడ  ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దెబ్బలతోనే అతను మృతిచెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.