పోలీసు కుటుంబాలకు క్యాన్సర్‌ నిర్థారణ పరీక్షలు

హైదరాబాద్‌: ఏపీఎస్పీ మొదటి బెటాలియన్‌ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు క్యాన్సర్‌ నిర్థాకణ పరీక్షలు ఈరోజు నిర్వహించారు. యాసఫ్‌గూడలోని మొదటి బెటాలియన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఐపీఎస్‌ అధికారి, అడిషనల్‌ డీజీపీ (బెటాలియన్స్‌) గౌతం సవాంగ్‌ విచ్చేసి ఈ కారక్రమాన్ని ప్రారంభించారు. క్యాన్సర్‌ను ప్రథమ దశలోనే  గుర్తిస్తే నివారించవచ్చన్నారు. మన రాష్ట్రంలో ఆరోగ్య భద్రత పథకాన్ని పోలీసుల కుటుంబ సభ్యులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా  వర్తించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.