పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్త బాధ్యతల స్వీకరణ

జనంసాక్షి, హైదరాబాద్‌ : పోలీస్‌ కమిషనరేట్‌ లో సంక్రాంతి పండుగ రోజున ముగ్గురు ఐసీఎన్‌ అధికారులు కొత్తగా బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్‌ రేంజి డీఐజీగా పనిచేస్తున్న ఎన్‌.సంజయ్‌ మంగళవారం ఉదయం సంయుక్త కమిషనర్‌గా కమలాసన్‌రెడ్డి, దక్షిణమండలం ఉపపోలీస్‌ కమిషనర్‌గా డాక్టర్‌ తరుణ్‌జోషిలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు మర్యాద పూర్వకంగా ఉన్నతాధికారులను కలుసుకున్నారు.