పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో అవినీతి

యానాం: పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ఓ అధికారి అవినీతికి పాల్పడ్డారని అసెంబ్లీలో యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం పుదుచ్ఛేరిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఆదివారం రాత పరీక్ష నిర్వహించగా అదే రోజు రాత్రి ఫలితాలు ప్రకటించకుండా ఒక రోజు ఆలస్యం చేయడం వల్ల పోలీసు శాఖలోనని  ఓ ఉన్నతాధికారి యానాం ప్రాంతానికి చెందిన అభ్యర్థుల నుంచి రూ. 2లక్షల చొప్పున నగదు వసూలు చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని మల్లాడి కృష్ణారావు డిమాండ్‌ చేశారు. పరీక్ష పారదర్శకంగా నిర్వహించినప్పటికీ ఎంపికైన అభ్యర్థుల వివరాలు ముందుగా తెలుసుకున్న అధికారి సదరు అభ్యర్ధుల నుంచి నగదు వసూలు చేశారని ఆయన ఆరోపణ చేశారు.