పోలీస్‌ స్టేషన్‌కు హాజరైన పరిటాల శ్రీరామ్‌

అనంతపురం: ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ ఈరోజు ధర్మవరం గ్రామీణ పోలీసుస్టేషన్‌లో హాజరయ్యారు. బెయిలు పత్రాలతో పాటు రూ.25 వేల పూచీకత్తును ఆయన పోలీసులకు సమర్పించారు. కాంగ్రాస్‌ నేత హత్యకు కుట్ర పన్నారన్న కేసులో శ్రీరామ్‌కు అనంతపురం కోర్టు నిన్న ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.