పోలీస్ ఇన్ స్పెక్టర్ ఆత్మహత్య

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో  దారుణం చోటుచేసుకుంది. ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం సుంగ్రాలీ జిల్లాలో చోటు చేసుకుంది. కొత్వాలిలో ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్ ఎస్ భదోరియా(58) పోలీస్ స్టేషన్ లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పూనుకున్నాడు.  మూడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ లో కలకలం రేగింది.

తలలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన ఇన్ స్పెక్టర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్పీ డీకే చక్రవర్తి తెలిపారు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ అన్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించినట్లు స్పష్టం చేశారు.