పౌర్ణమి పాయసం ఎందుకు తీసుకోవాలి


మిర్యాలగూడ, జనం సాక్షి.
మన శశీరంలో ఆయుర్వేద ఋషులు చెప్పే విధంగా ప్రతి రోజు 13 రకముల మార్పులు జరుగుతుంటాయి, శరీరమును మూడు విధములుగా అనగా వాత, పిత్త, కఫ రకములుగా విభజించబడినది. ఈ మూడు దోషములను పసిగట్టి వైద్యుడు వైద్యం చేయడం జరుగుతుంది, ఈ మూడు దోషములు సమపాలలో శరీరములో ప్రకంపములు జరిగినచొ మనిషి ఏ జబ్బునపారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవిస్తాడు, నేటి ఆహార విషయానికొస్తే రసాయనాలు ఎక్కువ వినియోగించి పండించిన పంటలతో పుట్టుకుకతోనే అనేక జబ్బుల బారిన పడుచున్నారు, ఈ తరుణంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఉచితంగా వైద్యం చేయడం సాధ్యపడని విషయం, మన పురాతన ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన పౌర్ణమి కిరణాలను పాల ద్వారా సేకరించి, తయారుచేసే పౌర్ణమి పాయసంతో సహజ రోగ నిరోధక శక్తి పొందవచ్చును. బోధిధర్మ ఆయుర్వేద పండిట్ శ్రీనివాస్ గురించి 1971 సంవత్సరం కొండా సోమయ్య, రాఘవమ్మల దంపతులకు మిర్యాలగూడ పట్టణం వేంకటాద్రిపాలెంలో జన్మించ్చటం జరిగింది, తన 31 సంవత్సరంలో హై.బి.పి వలన రెండు కిడ్నీలు పనిచేయక 63 సార్లు గాంధీ హాస్పిటల్ లో కిడ్నీ డయాలిసిస్ చేయించుకోవడం జరిగింది. తన స్నేహితుల ద్వారా తమిళనాడుకు చెందిన వీరరాఘవన్, తారాబాయి కోయ దంపతుల గురించి వారి వైద్యం గురించి తెలుసుకొని కేవలం 6 నెలల్లో వారి వైద్యం వలన కిడ్నీ చికిత్స చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారడం జరిగింది ఈ ఆరు నెలల్లో వారితో ఏర్పదిన పరిచయం వలన నాకు కుమారులు లేరు బిడ్డా ఈ వైద్యం నేర్చుకో కొన్ని లక్షల మందికి జీవం పొసే ఈ వైద్యం నాకు చదువు రాక ఎక్కువ విస్తరించలేకపోయిన అన్న తన గురువు “వీరరాఘవన్, తారాబాయిల మాటలకు స్పందించి 5 సంవత్సరాలు పండిట్ శ్రీనివాస్ గారు తన భార్య, పిల్లలను వదిలి వారి ఇంట్లో ఉండి వేద వైద్యంను నేర్చుకొని తన గురువులు తదనంతరం బోథిధర్మ ఆయుర్వేద వైద్య సేవ సమితిని తాను నిర్వహిస్తూ, ఉన్న ఊరు కన్న తల్లి చెప్పిన విధంగా మన మిర్యాలగూడలో శాఖను ఏర్పాటు చేసి వైద్యం చేయుచున్నాను. వీరి చికిత్సలు క్యాన్సర్, కిడ్నీ, తో ఎన్నో రోజుల నుండి బాధపడుతున్న వారికి భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా చికిత్స లేదు అని చెప్పబడుచున్న ఈ వ్యాధులకు పూర్తి పరిష్కారం అంతేకాకుండా గ్లకోమా (నీటికాసుల జబ్బు) వలన చూపు కోల్పోయి బాధపడుతున్న వారికి చూపు తెప్పించిన భారతీయ మొట్ట మొదటి వైద్యుడు, ఇవే కాకుండా మానవ శరీరంలో ఎన్ని జబ్బు ఉన్నా వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు. బోధిధర్మ ఆయుర్వేద వైద్యం ద్వారా డాక్టర్ పండిట్ శ్రీనివాస్ గారి సేవలు గుర్తించి 2019 సంవత్సరమున “ఆయుర్వేద రత్న” మరియు 2020 సంవత్సరమున “ఆయుర్వేద సామ్రాట్” తరువాత 2021 సంవత్సరమున ఆయుర్వేద విభూషణ్ అవార్డులతోపాటు 2020 సంవత్సరమున చెన్నై యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందటం జరిగింది