ప్యాకేజీలు వద్దు రాష్ట్రమే కావాలి : సారయ్య

హైదరాబాద్‌: ‘ ప్యాకేజీలు. పదవులు సీమాంధ్ర నేతలనే తీసుకోమనండి, మాకు మాత్రం ప్రత్యేక రాష్ట్రం కావాలి’ అని మంత్రి సారయ్య అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ అధికారుల, ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వద్దనేందుకు అసదుద్దీన్‌ ఎవరని ప్రశ్నించారు. అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు సారయ్య తెలియజేశారు.