ప్రకటన రాకపోతే సహించేది లేదు : కోదండరాం

హైదరాబాద్‌: ఈ నెల 28న తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకపోతే ఇక ఏ మాత్రం సహించేది లేదని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం హెచ్చరించారు. ఇందిరాపార్కు వద్ద ఈ నెల 27న 36 గంటల తెలంగాణ ఐకాస సమరదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో ఐకాస భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.