ప్రకాశం మరియు గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

ఒంగోలు: ఈనెల 9,10 తేదీల్లో గుంటూరు, ప్రకాశం జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పర్యటించనున్నట్లు ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు తెలిపారు. ఎర్రన్నాయుడు మాట్లాడుతూ 9న గుంటూరు జిల్లాలో, 10న ప్రాకాశం జిల్లాలోని వాస్‌పిక్‌ భూములను పరిశీలించి, బాధితుల సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో ముందుగా పర్యటిస్తారని వివరించారు.