ప్రజలపై మరింత భారం వేయడం సరికాదు:సీఎంకు రాఘవులు లేఖ

హైదరాబాద్‌: డీజిల్‌ ధరల పెంపు, గ్యాస్‌ సిలిండర్ల కుదింపు సమస్యలతో సతమ తమవుతున్న ప్రజలపై వ్యయసర్దుబాటు పేరుతో మరింత భారం వేయడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలనే దూరదృష్టి లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కోను నిర్లక్ష్యం చేసి ప్రైవేటు మర్చంట్‌ ప్లాంట్‌లకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఫలితంగానే ఖరీదైనా విద్యుత్తు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. 2012-11, 2011-12 ఆర్ధిక సంవత్సరాలకు గాను 6 వేల 116 కోట్ల రూపాయల వ్యయసర్దుబాటు వసూలుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. వీటిని కూడా రానున్న మూడు  నెలల్లోనే వినియోగదారులపై వేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలని రాఘవులు డిమాండ్‌ వ్యక్తం చేశారు.