‘ప్రజావాణి’ సమస్యలను… పరిష్కరిస్తా

– తహాశీల్దార్‌ పద్మయ్య
రామగుండం, జులై 16, (జనం సాక్షి)
ప్రజల సమస్యలను పరిష్కరించడానికిి నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తహాశీల్దార్‌ బైరం పద్మయ్య పేర్కొన్నారు. సోమవారం తహాశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 26 దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రేషన్‌కార్డులకు సంబంధించినవి 12, భూమికి సంబంధించినవి 1, నివేశస్థలంకు సంబంధించినవి 5, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినవి 4, పెన్షన్‌ సంబంధించినవి 2, ఇతరాలకు సంబంధించినవి 2 వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపిడిఓ వెంకటచైతన్య, ఎంఈఓ మధుసూధన్‌, ఏపిఓ రమేష్‌, వ్యవసాయాధికారిణి వినీల, ఏపిఎం తిరుపతి, ఏఈఓ శైలజ, విఆర్‌ఓలు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.