ప్రజావాసాలకు దగ్గరగా ఉన్న కెమికల్ కంపెనీ లను తరలించాలని అతహర్ డిమాండ్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):—
భువనగిరి అసెంబ్లీ కేంద్రం లోని బీబీ నగర్, పోచంపల్లి, భువనగిరి లో కల ప్రాణంతక కెమికల్ కంపెనీ లను తరలించాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ డిమాండ్ చేశారు. భువనగిరి లో విలేకరుల సామావేశం లో అతహర్ మాట్లాడుతూ మంగళవారం రోజు బీబీ నగర్ విధ్యుత్ సబ్ స్టేషన్ కు ఎదురుగా కల పోరస్ లబోరేటరీస్ అనే కెమికల్ కంపెనీ లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరగడం వలన అందులో నుండి వెలువడిన ప్రాణంతక విష వాయువుల వలన ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే కాకుండా గతంలో ఇదే బీబీ నగర్ మండలం కొండమడుగు గ్రామం లోని కెమికల్ కంపెనీ లలో అగ్ని ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం కూడా జరిగిందని స్థానిక ప్రజలు ఎన్ని సార్లు మోరపెట్టుకున్నా కూడా ప్రజా ప్రతినిధులు కానీ, అధికారులు కానీ స్పందించడం లేదని వాపోయారు . అంతే కాకుండా ఆ ప్రదేశాల్లో ఎక్కడ బోర్లు వేసినా కూడా అందులో కెమికల్ కలుషిత నీళ్లు రావడం వలన రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చివరికి పశువులు తాగే నీళ్లలో కూడా రసాయణాలు కలుషితం అవడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు ప్రజలు నివసించే ప్రదేశాల్లో ప్రాణాంతక కెమికల్ కంపెనీ లకు అనుమతి ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టుంచుకొని బీబీ నగర్, పోచంపల్లి మండలాల్లో కల ప్రణాంతక కెమికల్ కంపెనీ లను అక్కడి నుండి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని లేనియెడల పెద్ద ఎత్తున ధర్నాలు చెప్పడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు షకీల్, పట్టణ అధ్యక్షులు సాయి నివాస్, పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షులు వాహెద్, యూత్ కార్యదర్శి రాకేష్ నాయకులు అనిల్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.