ప్రజాసంక్షేమం పట్ల రాజకీయ పార్టీల బాధ్యత

హైదరాబాద్‌: సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమాల పట్ల రాజకీయ పార్టీల బాధ్యత చాలా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిటిజెన్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంతకాలం నిలవగలవనేది రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆలోచిస్తాయని వక్తలు సదస్సులో పాల్గొన్నా విద్యార్థులకు వివరించారు. ప్రజల్లో నిలవగలిగే సంక్షేమ పథకాల గురించే రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయని సదస్సులో పాల్గొన్న వివిధ పార్లీ ప్రముఖులు పేర్కొన్నారు.