ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి శ్రీనివాసలీలలు…
జనంసాక్షి ప్రతినిధి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
సెప్టెంబర్ 8:-.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు వక్రమార్గాన తరలిస్తుంటే అరికట్టాల్సిన అధికారి ఆ రేషన్ డీలర్లను తను ఒక ఉన్నత అధికారి అనే పలుకుబడితో మీ పై పలు రకాల కేసులు పెడతానని బెదిరించి రేషన్
షాపులో బియ్యం తక్కువగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయంటూ డీలర్ల వద్ద నుండి కొన్ని వేల రూపాయలు ఇతర వ్యక్తికి బదిలీ చేయించుకున్న సంఘటన జరిగింది. ప్రతి నెల నెల తను కేసులు పెట్టకుండా ఉండడానికి డీలర్ల వద్దకు రాకుండా ఉండడానికి కమిషన్ ప్రతి నెలా పెద్దమొత్తంలో ఇవ్వాలంటూ ఆ అవినీతి కలియుగ వైకుంఠ అధిపతి ఆ రేషన్ డీలర్లకు హుకుం జారీ చేయడం ఈ విషయంలో కోస మెరుపు.జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ అవినీతి కలియుగశ్రీనివాసలీలల పై చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఈ అవినీతి శ్రీనివాసలీలలపై మరింత సమాచారంతో త్వరలో మీ ముందుకు…