ప్రజా మేలు కోరుకుని పనిచేస్తున్న ఏకైక పార్టీ BRS

వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 4
శనివారం నాడు విద్యాశాఖ మాత్యులు శ్రీమతి గౌరవ “సబితా ఇంద్రారెడ్డి” గారు, వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు ధారూర్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ధారూర్ మండలం BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ముందుగా కుక్కింద గ్రామ సర్పంచ్, ధారూర్ మండలం సర్పంచుల సంఘం మండల అధ్యక్షులుగా ఉన్న వీరేశం గారు ఇటీవల కాలంలో మరణించడంతో వారికి నివాళులు అర్పిస్తూ… మౌనం పాటించారు.ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్ గారి సూచనలతో… ప్రతి మండలంలో BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రతి కార్యకర్త విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టి, దేశంలో ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రభుత్వాల కంటే, తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన సంక్షేమ పథకాల అమలు, పరిపాలనా సౌలభ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణ అభివృద్ధి ప్రజలకు వివరించాలన్నారు.
గ్రామస్థాయి వార్డు స్థాయిలలో బాధ్యతలు తీసుకున్న కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.