ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలి ఎమ్మెల్యే మదన్ రెడ్డి
నర్సాపూర్లో పీఎం మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.
నర్సాపూర్. మార్చి , 3 , ( జనం సాక్షి ) కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ నర్సాపూర్ పట్టణంలోని చౌరస్తా వద్ద గ్యాస్ సిలిండర్ లను పెట్టి నిరసన తెలిపి ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ 400 ఉన్న గ్యాస్ ధరను 1200 వరకు పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల పేద ప్రజలపై తీవ్ర భారం పడి దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్న రాని ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వం ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలు మహిళలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కరెంటు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ప్రజల పక్షాన నిలబడిన కేసీఆర్ వాటిని తిప్పి కొట్టాడని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి చౌరస్తా వరకు ర భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమ్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్ర వెంకటరెడ్డి, కౌన్సిలర్లు సరిత, లలిత,బి ఆర్ ఏస్ నాయకులు శేఖర్, బిక్షపతి, నగేష్, ఆంజనేయులు గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Related