ప్రజ్ఞాఠాగూర్‌కు క్యాన్సర్‌

భోపాల్‌ : 2008 మాలేగావ్‌ పేలుళ్లు, సునీల్‌జోషి హత్య కేసుల్లో ప్రధాన నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాగూర్‌ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు జవహర్‌లాల్‌ నెహ్రూ క్యాన్సర్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమెకు అత్యావసర వైద్యం అవసరమని, వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచించినా ఆమె నిరాకరించినట్లు వారు పేర్కొ న్నారు. కొన్ని సంప్రదాయ కార్యక్రమాల అనంతరం తాను ఆస్పత్రిలో చేరుతానని ఆమె తెలిపారని వారు తెలిపారు. ఆమెకు వెంటనే వైద్య సేవలు అందించాల్సిన అవసరముందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.