ప్రణబ్‌కు మద్దతివ్వడం తెదేపాకు అంగీకారం కాదు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌కు మద్దతివ్వడం తెదేపాకు అంగీకారం కాదని తెదేపా నేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు తెదేపా గైర్హాజరయ్యేందుకు నిర్ణయించుకున్న నేపధ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై మూడు దశాబ్దాలుగా తెదేపా పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. మతతత్వ భాజపా నాయకత్వంలోని ఎన్డీయే అభ్యర్థి సంగ్మాకు మద్దతివ్వడం కూడా తమకు సమ్మతం కాదని ఆయన చెప్పారు.