ప్రణబ్‌ముఖర్జీతో సబ్బం హరి సమావేశం

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీతో ఎంపీ సబ్బం హరి భేటీ అయ్యారు. సబ్బంతోపాటు కేంద్ర మంత్రి నారాయణ స్వామి కూడా ప్రణబ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వీరు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ యూపీఏకు మద్దతు ఇవ్వనున్నట్టు తెలిసింది.