ప్రత్యేక రైళ్ల పొడిగింపు

సికింద్రాబాద్‌: ప్రయాణీకుల రద్దీ దృష్యా జైపూర్‌-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 18 న రాత్రి 9.10 నిమిషాలకు జైపూర్‌-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఉంటుంది. ఈ నెల 20 న రాత్రి 11.25 నిమిషాలకు సికింద్రాబాద్‌-జైపూర్‌ ప్రత్యేక రైలు ఉంటుంది. కాచిగూడ-చిత్తూరు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు మరో స్లీపర్‌ క్లాస్‌ బోగీ జత చేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.