ప్రధాని పదవి చేపట్టాలని సోనియాకు రాష్ట్రపతి కార్యలయం ఉత్తర్వులు

ఢిల్లీ: ప్రధాని పదవి చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా సోనియాగాంధీని ఆహానిస్తూ రాష్ట్రపతి కార్యాలయం లేఖ కూడా సిద్దం చేసింది. ఎందుకంటే రాజ్యాంగపరంగా అప్పుడిక మరో మార్గం లేదు. అయితే మేమంతా ఆశ్చర్యపోయేలా సోనియా గాంధీ ప్రధాని పదవికి మన్మోహన్‌సంగ్‌ను నామినేట్‌ చేశారు. రాష్ట్రపతి కార్యాలయం వెంటనే ఆ లేఖలో తదనుగుణంగా మార్పులు చేయాల్సివచ్చింది. 2004 నాటి ఈ పరిణామాల ప్రస్తావన  ఇప్పుడెందుకు వచ్చిందంటే మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం తాజా రచన, త్వరలో ప్రచురితం కానున్న ‘టర్నింగ్‌పాయింట్స్‌లో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ప్రధాని పదవికి సోనియా గాంధీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించవద్దని కోరుతూ పలు సంస్ధలనుంచి, వ్యక్తుల నుంచీ  కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు, ఈ మెయిల్స్‌ వచ్చాయి. కలిసి అభ్యర్థించిన నేతలు, పార్టీల సంగతి సరేసరి కానీ నిజానికి ఆమె పదవి కోరుకుంటే రాజ్యంగం  ప్రకారం కాదనడానికి వీల్లేని పరిస్థితి ఆమెను ప్రధానిగా నియమించడం మినహా రాష్ట్రపతిగా నాకు మరో మార్గం లేదు. అంటూ కలాం ఆనాటి పరిస్థితుల గురించి ఈ పుస్తకంలో పేర్కొన్నారు. 2005లో బీహర్‌ అసెంబ్లీ రద్దు నిర్ణయం రాజ్యాంగవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంలో తాను రాజీనామా లేఖ రాసిన సంగతి కూడా ఆయన ఇందులో పేర్కొన్నారు. ప్రధాని నచ్చజెప్పడంతో నిర్ణయం మార్చుకున్నట్లు ఆయన రాశారు.