ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మహ్మద్‌ అబ్బాస్‌తో భేటీ

న్యూఢిల్లీ: భారత్‌ పాలస్తీనాకు 10 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, పాలస్తీనా అధారిటీ అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పశ్చిమా ఆసియా, గల్ఫ్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మూడు అవగాహనా ఒప్పందాల(ఎంవోయూ)పై వారు సంతకాలు చేశారు. ఆ దేశ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని 10 మలియన్‌ డాలర్ల అందజేయనున్నట్లు ప్రకటించారు. తమ దేశానికి అండగా నిలుస్తూ ఆర్థిక సాయం ప్రకటించిన భారత్‌కు మహ్మద్‌ అబ్బాస్‌ కృతజ్ఞతలు తెలిపారు.