ప్రపంచ తెలుగు మహాసభలకు తానా సంఘీభావం

హైదరాబాద్‌: అమెరికాలోని తెలుగువారంతా ప్రపంచ తెలుగు మహాసభల్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడు రమణమూర్తి పిలుపునిచ్చారు.తిరుపతిలో జరగనున్న నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సంఘీభావం తెలిపింది.  సమాజంలో ఎన్ని విభేదాలున్నా భాషా సంస్కృతి విషయానికి వస్తే తెలుగు వారంతా చాటి చెప్పేలా సభలు జరుగుతాయన్నారు. మే నెలలో డల్లాస్‌లో 19వ తానా మహాసభలు జరుగుతాయని తానా అధ్యక్షుడు ప్రసాద్‌ తెలిపారు. మూడు దశాబ్దాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించడంపై తానా సభ్యులు హర్షం వ్యక్తంచేశారు.