ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది : నాగేశ్వరరావు
వరంగల్: కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రభుత్వాలు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదముందని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని నామా తెలియజేశారు. అవసరమైతే అవిశ్వాసం పెట్టే అంశం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.