ప్రభుత్వం విద్యుత్‌ సర్‌ఛార్జీ ఎలా వసూలు చేస్తుంది?:హరీష్‌రావు

హైదరాబాద్‌: విద్యుత్‌ సర్‌ఛార్జీల వసూలు పై తెరాస మండిపడింది. గ్రామాల్లో ప్రస్తుతం 18 గంటల విద్యుత్‌ కోత విధిస్తున్నారని ఆ పార్టీ నేత హరీష్‌రావు  తెలంగాణభవన్‌లో మాట్లాడుతూ అన్నారు. గ్రామాలకు విద్యుత్‌ సక్రమంగా ఇవ్వని ప్రభుత్వం సర్‌ఛార్జీ ఎలా వసూలు చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికి ఐదుసార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం 2012-13 మొదటి త్రైమాసికంలో ఇంధన సర్‌ఛార్జీ వసూలుకు రంగం సిద్థం చేసిందన్నారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. ల్యాంకో , జీఎంఆర్‌లకు అక్రమ చెల్లింపులపై దర్యాప్తు జరిపించాలని  లేకుంటే కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.