ప్రభుత్వాల వైఫల్యాల వల్లే మెట్రో ప్రాజెక్టు ఆలస్యం: శ్రీధరన్‌

హైదరాబాద్‌: రాజకీయ జోక్యం వల్లే హైదరాబాద్‌ మెట్రో& రైలు ప్రాజెక్టు ఆలస్యమవుతోందని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్‌ ముఖ్య కార్యధర్శి శ్రీధరన్‌ అభిప్రాయపడ్డారు. ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశముందన్నారు. ప్రభుత్వాల వైఫల్యాల వల్లే ప్రజెక్టు పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు. హైదరాబాదులోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీ 27వ స్మారక ఉపన్యాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఢిల్లీ మెట్రోరైలు విజయవంతం కావడంపై సుదీర్ఘంగా ప్రసంగించారు.