ప్రభుత్వ ఏర్పాట్లపై వినాయక ఉత్సవ కమిటీ అసంతృప్తి

హైదరాబాద్‌: గణేశ్‌ నవరాత్రులకు ప్రభుత్వ ఏర్పాట్లపై భాగ్యనగర ఉత్సవ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. మండపాల అనుమతులకు పోలీసులు వేధించడంతో పాటు వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేయటం లేదని వారు మండిపడ్డారు. నిమజ్జనం సమయంలో రవాణా శాఖ అధికారులు తగినన్ని వాహనాలు ఏర్పాటు చేస్తామని ఏటా చెప్తూనే చివరకు చేతులేత్తేస్తున్నారని, ఈ సారి అది పునరావృతం కాకుండా చర్యలు ఈసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలు నిమజ్జనం అనంతరం 48 గంటల్లో తీసేయాలని కోర్టు ఆదేశించినా జీహెచ్‌ఎంసీ అలసత్వం కారణంగానే వివాదాలు వస్తున్నాయన్నారు.