ప్రభుత్వ పాఠశాలలో గుడుంబా నాటు సారా నిల్వ

హైదరాబాద్‌: పాఠశాల గుడుంబా గోడౌన్‌గా మారింది. సాక్షాత్తూ గురుపూజోత్సవం రోజునే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో గుడుంబా గోడౌన్‌ నిర్వహిస్తున్నారనే సమాచారంతో చార్మినార్‌ ఎక్సైజ్‌ పోలీసులు దాడిచేయగా నాలుగు వేల గుడుంబా ప్యాకెట్లు, 300 లీటర్ల నాటు సారా లభించింది. అదే చోట గుడుంబాతో పాటు గణేశ్‌ విగ్రహాలు కూడా ఉన్నాయి. గుడుంబాతో పాటు వాటిని కూడా అక్కడ నిల్వ ఉంచారని సీఐ తెలిపారు. ఈ సంఘటన పాతబస్తీలోని పురానాపుల్‌ వీర్‌పుత్ర హిందీ విద్యాలయ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో చోటుచేసుకుంది.