ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్‌ఎస్ ధర్నా
ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎచ్‌ఎండీఎ కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి భూముల వేలాన్ని ఆపాలంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉదృక్తం కావడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ధర్నాలో టీఆర్‌ఎస్ నేత ఎమ్మెల్యే కేటీఆర్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కత్తి పద్మరావు , పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి భూములను అమ్మి ఎచ్‌ఎండీఎ రైతుల నోరు కొట్టిందని వారు విమర్శించారు. గత వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఆక్కడి భూములు అమ్మి రూ. 1700 కోట్లు సంపాదించారని నేతలు ఆరోపించారు. ఈ డబ్బును ఎచ్‌ఎండీఎ ఈ ప్రాంత అభివృద్దికి ఖర్చు చేయకుండా ప్రభుత్వనికి అప్పగించిందని,ఎచ్‌ఎండీఎను వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఒక పావులా వాడుకుందని వారు ఆరోపించారు. ఈ డబ్ముతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ జేబు నింపారని, ఇక్కడి భూములు వేయ్యడం ద్వారా సీమాంధ్ర పెట్టుబాడిదారులు, కాంట్రాక్టర్లు లాభం పోందారని ఆరోపించారు. ఇప్పటికైనా భూములు వేలం వేయడం ఎచ్‌ఎండీఎ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని త్రీవతరం చేస్తామని వారు హెచ్చారించారు. రంగారెడ్డి భూములు రైతుల సోత్తు, వాటిని వేలం వేయరాదని కోరారు.