ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నియామ‌కాలు ర‌ద్దు

హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నియామ‌కాల ర‌ద్దుకు సీఎం రేవంత్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు స‌ల‌హాదారుల నియామ‌కాలు ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.మాజీ ఐఏఎస్‌లు రాజీవ్ శ‌ర్మ‌, సోమేశ్ కుమార్, మాజీ ఐపీఎస్‌లు అనురాగ్ శ‌ర్మ‌, ఏకే ఖాన్, మాజీ ఐఈఎస్ జీఆర్ రెడ్డి, మాజీ ఐఎఫ్ఎస్ ఆరో శోభ‌, మాజీ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్‌ను గ‌త ప్ర‌భుత్వం స‌ల‌హాదారులుగా నియ‌మించింది. నేటి ఉత్త‌ర్వుల‌తో వీరి నియామ‌కాలు ర‌ద్దు అయ్యాయి.