ప్రయాణికుల నుంచి అభివృద్ధి రుసుం: ఖాన్
హైదరాబాద్: ప్రయాణికుల నుంచి అభివృద్ధి రుసుం వసూలు చేయాలనే ప్రతిపాదన వాస్తవమే అని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలియజేశారు. దీన్ని ఎప్పుటి నుంచి, ఎంతమేర వసూలు చేయాలన్న విషయాన్ని ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పలు ఆర్టీసీ ప్రారగణాలు శిధిలావస్థకు చేరాయని..ప్రయాణికులకు మెరగైన సదుపాయాల కోసమే అభివృద్ధి రుసుం వసూలు చేయనున్నట్లు ఖాన్ వెల్లడించారు.



